ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. లేడీ ఒరియంటెడ్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న ఈ బ్యూటీ.. టాప్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డిలోనూ నయనతార నటించారు.
ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నటించిన నయనతార భారీ పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం నయన కు ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయిలు పారితోషికంగా ఇచ్చారట. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల సరసన చేరింది నయనతార.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సైరా నరిసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగా తమిళనాట విజయ్ సరసన బిగిల్, రజనీకాంత్ సరసన దర్బార్ సినిమాల్లో నటిస్తున్నారు నయనతార.