lata mangeshkar to be honored with daughter of the nation award
మధురమైన గాత్రంతో ఏడు దశాబ్ధాలుగా అలరిస్తున్న గాన కోకిల లతా మంగేష్కర్. ఆమె తండ్రి దిననాథ్ మంగేష్కర్ శాస్త్రీయ గాయకుడు మరియు నాటక కళాకారుడు కాగా, తండ్రి అడుగజాడలలో నడచిన లతా మంగేష్కర్ మంచి సింగర్‌గా పేరు ప్రఖ్యాతలు పొందింది.
1929 సెప్టెంబర్ 28 న ఇండోర్‌లో జన్మించిన లతా మంగేష్కర్ పలు భాషలలో పాటలు పాడారు. లతా మంగేష్కర్ 1942 నుండి దాదాపు 7 దశాబ్దాలలో 1000 కి పైగా హిందీ చిత్రాలలో 25 వేలకు పైగా పాటలు పాడారు .ఈ ఏడాది సెప్టెంబర్ 28న లతా 90వ వసంతంలోకి అడుగు పెట్టనుండగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమెని డాటర్ ఆఫ్ ది నేషన్ బిరుదుతో సత్కరించనున్నట్టు తెలుస్తుంది.
లతా మంగేష్కర్ జాతీయ అవార్డు, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకుంది. అదే సమయంలో లతా మంగేష్కర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం అయిన భారత్ రత్న కూడా లభించింది. భారతీయ చలన చిత్ర సంగీత రంగంలో ఆమె చేసిన చారిత్రక కృషికి డాటర్ ఆఫ్ ది నేషన్ బిరుదు ఇవ్వనున్నారు.
Also Read : మంచి అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటా..