నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “నాట్యం”.
సంధ్యరాజు, సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు.
దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ బెహల్, భానుప్రియ, కమల్‌కామరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
తాజాగా “నాట్యం” టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ “నాట్యం” టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా టీజర్ మొత్తం “నాట్యం”తో నింపేశారు. డ్యాన్స్ నేపథ్యంలో రూపొందుతున్న “నాట్యం” టీజర్ లో నాట్యంతో పాటు రొమాంటిసి లవ్ స్టోరీ, థ్రిల్లింగ్ ముషాలు కూడా ఉన్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.
మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.