
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించిన ‘ఉప్పెన’ మూవీ ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టడంతో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట నిర్మాతలు.
“ఉప్పెన”లో వైష్ణవ్ తేజ్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు ఆఫర్స్ వెల్లువ మొదలైంది. పలువురు దర్శకనిర్మాతలు వైష్ణవ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారట.
ఈ నేపథ్యంలోనే హీరో నాని రిజెక్ట్ చేసిన ఓ కథను వైష్ణవ్ ఓకే చేశారని తెలుస్తోంది.
ఇటీవల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేశాడు. అది హీరో నాని చేస్తే బాగుంటుందని భావించిన ఆయన నానికి కథ చెప్పగా.. నాని రిజెక్ట్ చేశారట.
దీంతో అదే కథను వైష్ణవ్ తేజ్‌కు వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిలిం నగర్ టాక్.
త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు.
ఇకపోతే వైష్ణవ్ తేజ్ దర్శకుడు క్రిష్‌తో ఓ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై మరో సినిమా, భోగవల్లి ప్రసాద్ బ్యానర్‌పై ఇంకో సినిమా చేయబోతున్నారట.