నాని కొత్త సినిమాకి ఆసక్తికరమైన టైటిల్

407
interesting title

గతంలో నాని కథానాయకుడిగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చమ్మా’ .. ‘జెంటిల్ మేన్’ ను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి చేసిన ‘సమ్మోహనం’ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ఇంద్రగంటి మోహనకృష్ణ రంగంలోకి దిగాడు.

కథా పరంగా ఈ సినిమాకి ‘వ్యూహం’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నానియే విలన్ అనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కాగా .. భాగస్వామిగా నాని ఉంటాడని చెబుతున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.