ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన తెలుగు రియాలిటి షో బిగ్ బాస్. ఈ కార్యక్రమంతోనే ఎన్టీఆర్ బుల్లితెరకి డెబ్యూ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 1లో జూనియర్ తనదైన సంబాషణలతో పాటు కంటెస్టెంట్‌లని డీల్ చేసిన విధానం బుల్లితెర ప్రేక్షకులకి ఎంతగానో నచ్చేసింది. బిగ్ బాస్ 2 సీజన్ ఎప్పుడు మొదలు అవుతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా బిగ్ బాస్ 2 సీజన్‌కి ఎన్టీఆర్ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత, వృత్తిపరమైన కమిట్ మెంట్స్ వలన ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉండరనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ ప్లేస్‌లో నేచురల్ స్టార్‌ని పోగ్రాం నిర్వాహకులు పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ గైర్హాజరు కారణంగా ఆ స్థానంలో పలువురు టాప్ హీరోల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అల్లు అర్జున్, రానా లలో ఒకరు బిగ్ బాస్ 2 హోస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కాని నేచురల్ స్టార్ నానినే సీజన్ 2కి హోస్ట్‌గా ఫైనల్ చేశారని టాక్స్ వినిపించాయి. గతంలో నానికి రేడియో జాకీగా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. అంతేకాదు మంచి స్పాంటనిటి కూడా అతనిలో ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్2కి నానినిహోస్ట్‌గా తీసుకోవాలని నిర్వాహకులు భావించారట. అయితే కృష్ణార్జున యుద్ధం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ విలేకరి బిగ్ బాస్ షో హోస్ట్ చేయనున్నారా అని నానిని ప్రశ్నించగా, అందుకు లేదని చెప్పాడు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించేందుకు నాని సుముఖత వ్యక్తం చేశాడని తెలుస్తుంది . బిగ్‌బాస్ సీజన్ వన్ కోసం పుణే సమీపంలో వేసిన ఇంటి సెట్‌లో షూటింగ్ అంతా జరిపిన నిర్వాహకులు సెకండ్ సీజన్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి షూటింగ్ జరపనున్నారని టాక్. త్వరలోనే ఈ వార్తపై పూర్తి క్లారిటీ రానుంది.