టీవీ9 చేతికి దక్కన్ క్రానికల్ ?

1696
tv9-ready-to-takeover-deccan-chronicle

అప్పులు చెల్లించలేక.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక దక్కన్ క్రానికల్ పేపర్ దివాళా పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఈ పత్రిక ఆస్తుల విలువ లెక్కించటానికి, నిర్వహణ లావాదేవీల కోసం కైవసం చేసుకోవటానికి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థను నియమించింది కోర్టు. అయితే దివాళా పడిన దక్కన్ క్రానికల్ ను స్వాధీనం చేసుకోవటానికి దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే రంగంలోకి కూడా దిగాయి.



 

డెక్కన్ క్రానికల్ పత్రికను టేకోవర్ చేయటానికి మిగతా సంస్థలు ఎలా ఉన్నా..

తెలుగు టీవీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఆద్యులు అయిన టీవీ9 రేసులో ఉండటం విశేషం. దక్కన్ క్రానికల్ టేకోవర్ చేయటానికి ఇప్పటికే టీవీ9 దరఖాస్తు కూడా చేయటం విశేషం. టీవీ9 మాతృసంస్థ అయిన ఐ ల్యాబ్ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ దరఖాస్తు దాఖలు చేసింది. ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే.. మొత్తం 9 కంపెనీలు దక్కన్ క్రానికల్ స్వాధీనం చేసుకోవటానికి పోటీ పడ్డాయి. ఇందులో టీవీ9 ఒకటి.

దక్కన్ క్రానికల్ కు ఉన్న అప్పులు – ఆస్తులు ఎంత అనేది తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భూములు, బిల్డింగ్స్, ప్లాంట్స్, మెషినరీ, కంప్యూటర్లు, ఫర్నిచర్, వెహికల్స్ ఇలా అన్నింటి విలువపై ఓ అంచనాకి వచ్చారు. ఇక దక్కన్ క్రానికల్ బ్రాండ్ వ్యాల్యూ విలువ కట్టటం ఒక్కటే మిగిలింది. బ్రాండ్ విలువ ఫైనల్ కాగానే.. వేలం వేయనున్నట్లు సమాచారం. ఎవరు ఎక్కువ ధర పెడితే వారికే దక్కనుంది. దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో టైమ్స్ గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్, జీ గ్రూప్, ఏషియానెట్ న్యూస్ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రానికే చెందిన… దక్కన్ క్రానికల్ గురించి బాగా తెలిసిన టీవీ9.. టేకోవర్ చేసుకోవటానికి గట్టి పోటీ ఇవ్వనుంది.