నేను సై – క్లారిటీ ఇచ్చిన అనసూయ

370
anasuya clarity about sye raa

ఇటీవల వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా అనసూయ అద్భుతమైన నటనను కనబరిచిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తనకి వచ్చిన పేరుకు అనసూయ మురిసిపోతుంది. ఈ పాత్రలో చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానంటూ ఆమె తెలిపింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం ‘సచ్చిందిరా గొర్రె’ విడుదలకు సిద్ధమవుతోంది. 

ఇక రామ్ చరణ్‌తో రంగస్థలం చిత్రంలో నటించిన అనసూయ, ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా విజయవాడలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ.. ఈ వార్తపై క్లారిటీ ఇచ్చింది. ‘‘సైరాలో నటించమని చిత్రయూనిట్ నుంచి తనని ఎవరూ కలవలేదని, ఒకవేళ నిజంగా తనని నటించమని అడిగితే మాత్రం తప్పకుండా చేస్తానని తెలిపింది. అంత గొప్ప చిత్రంలో అవకాశం వస్తే ఎవరైనా చేయనని చెబుతారా..’’ అంటూ అనసూయ తెలిపింది.