కాస్ట్యూమ్ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “పచ్చీస్”. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకృష్ణ, రామసాయి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.
శ్వేతా వర్మ హీరోయిన్. ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ పతాకాలపై కౌశిక్ కుమార్ కత్తూరి, రామసాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే సినిమా ‘పచ్చీస్’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను కింగ్ నాగార్జున ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రామ్స్ నాకు పదేళ్ల నుంచీ తెలుసు. నా ‘రగడ’ చిత్రానికి పనిచేశాడు. వెరీ హార్డ్‌వర్కింగ్, వెరీ క్రియేటివ్.
ఎప్పుడూ కాస్ట్యూమ్ డిజైనింగే చేస్తాడా లేక సినిమాల్లోకి వస్తాడా.. ? అని మనసులో అనుకొనేవాడ్ని. నేను అనుకున్నట్లే ఇప్పుడు ‘పచ్చీస్’ సినిమాతో హీరోగా వస్తున్నాడు. కచ్చితంగా ఇది అతనికి సక్సెస్ ని ఇస్తుందని నాకు తెలుసు.
డైరెక్టర్ శ్రీకృష్ణకు మంచి పేరు, విజయం దక్కాలని ఆశిస్తున్నాను.
ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ కలిసి రామ్స్ హీరోగా నిర్మిస్తోన్న ‘పచ్చీస్’ మూవీ మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. టైటిల్, ఫస్ట్ లుక్ బాగున్నాయి” అని అన్నారు.
Here is the video of King @iamnagarjuna unveiling the Title and First look of #PachchisMovie. ✨ @raamzofficial @krishchad @dineshyadavb@csaikumarr @swetaaVarma @AvasaChitram @raastafilms#PachchisMovieFirstLook pic.twitter.com/VWygTpy8Mr
— BARaju (@baraju_SuperHit) February 23, 2021
టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌లను హీరో నాగార్జున లాంచ్ చేసినందుకు హీరో రామ్స్, డైరెక్టర్ శ్రీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.