పూరి, నాగ్ ల బొమ్మ దద్దరిల్లేనా

249
Nagarjuna and puri may join hands their next movie
  • కొడ్తే మళ్లీ శివ మని లాంటి హిట్ పడాల్సిందే

ఏది చెప్పిన గట్టిగ కొట్టి చెప్పినట్లే ఉంటుంది ,ఎదో సందేశం ఇస్తూనే మాస్ ఆడియన్స్ కావాల్సిన స్టఫ్ అయితే మిస్  ఆవ్వడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన నేమ్ సంపాదించుకుని తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ లో బిగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్,  నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివమని , సూపర్ సినిమాలు ,విజయం  సాధించిన సంగతి తెలిసిందే.

శివమణి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో పాటు నాగార్జున కెరీర్ లోనే స్పెషల్ సినిమాగా నిలిచింది ఈ సినిమా వచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి ఆ సినిమా క్రేజ్ తగ్గలేదంటే చెప్పదగ్గ విషయామె.

ఆ సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబో లో మరో సినిమా రాలేదు. మల్లి వీళ్లిద్దరి కాంబో లో సినిమా వస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

ఇప్పటికైతే  నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమా థియేటర్ లో  విడుదల కానుంది.ఈ సినిమా తరువాత నాగార్జున ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో అనేది ఇన్ని రోజుల వరకు రహస్యంగా నే ఉంచిన గతేడాది లాక్ డౌన్ సమయంలో పూరీ జగన్నాథ్ నాగార్జునకు సరిపోయే అదిరిపోయే స్క్రిప్ట్ రాశారని, నాగార్జున ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తడని సమాచారం. ఫాంటసీ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

త్వరలో నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.2019 సంవత్సరంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ తరువాత పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.పూరీ జగన్నాథ్ ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇటీవలే లైగర్ అనే మాస్ టైటిల్ నీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి హాట్ టాపిక్ గా మారాడు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతలు గా వ్యవరిస్తున్నారు