ప్రభాస్ అభిమానులను క్షమాపణలు కోరిన ప్రముఖ దర్శకుడు

173
Nag Ashwin Apologizes To Prabhas Fans

యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ క్షమాపణలు చెప్పారు.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈ సినిమా నుంచి రెండు అప్‌డేట్‌లు రానున్నాయని తెలిపారు నాగ్ అశ్విన్.

ఇచ్చిన మాట ప్రకారం నాగ్ అశ్విన్ తన మొదటి అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆ తరువాత రెండో అప్‌డేట్ ఈ నెల 26న రానుంది.

ఇటీవల ప్రభాస్ అభిమాని ఒకరు మరో పది రోజుల్లో రానున్న ప్రభాస్-నాగ్ అశ్విన్ అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశారు.

దానికి స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ నెటిజన్ ను క్షమించమని కోరారు, ఈ నెల 26న ఎటువంటి అప్డేట్ లేదని, అది సరైన సమయం కాదని ట్వీట్ చేశారు.

కొన్ని అనివార్య కారణాల వల్లే ఈ అప్‌డేట్ ఇవ్వలేక పోతున్నారట. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పలేదు.