తీన్మార్ మల్ల‌న్న మార్నింగ్ న్యూస్‌

459

తీన్మార్ మ‌ల్ల‌న్న శుక్ర‌వారం ఖ‌మ్మంలోని స‌ర్దార్ ప‌టేల్ స్టేడియం నుంచి మార్నింగ్ న్యూస్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ఇచ్చారు.

మేలో స్వ‌యంభూ ద‌ర్శ‌నం అన్న వార్త‌ను చ‌దివిన మ‌ల్ల‌న్న పేద‌లకు డ‌బుల్ బెడ్ రూమ్ ద‌ర్శ‌న‌మెప్పుడు అంటూ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు.

అమ్మా నాన్నా.. అన్నీ వారే అన్న వార్త‌ను చ‌దువుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో డాక్ట‌ర్లు, న‌ర్సులు చేసిన సేవ‌ల‌ను మ‌ల్ల‌న్న కొనియాడారు.

పెళ్లి సంద‌ట్లో పిల్ల దొంగ‌లు అనే వార్త‌ను మ‌ల్ల‌న్న చ‌దివారు. ఈ పిల్ల‌లు సంద‌డిగా తిరుతూ డ‌బ్బు, న‌గ‌లు దొచేసి పెద్ద వాళ్ల‌కు అంద‌జేస్తారు.

ఈ దొంగ‌ల ముఠా ఈ మ‌ధ్య‌నే హైద‌రాబాద్‌లోకి ప్ర‌వేశించింద‌ని సైబ‌రాబాద్ పోలీసులు హెచ్చరించారు. వీడియోల ఆధారంగా ఆ ముఠాను ప‌ట్టుకున్న‌ట్లు చెప్పారు.

అయితే ఈ చిన్న చిన్న దొంగ‌లను మ‌న పోలీసులు ప‌ట్టుకున్నారు. కానీ కాళేశ్వ‌రం పేరుతో, లిఫ్ట్ ఇరిగేష‌న్ పేరుతో దోపిడీ చేసిన ఈ ముఠాను ఎవ‌రు ప‌ట్టుకోవాలి.

ప్ర‌జ‌లారా మ‌న‌మే ప‌ట్టుకోవాలి అని మ‌ల్ల‌న్న అన్నారు. హైద‌రాబాద్ ర్యాంక్ డౌన్ 2014లో నాల్గ‌వ ర్యాంక్‌లో ఉన్న హైద‌రాబాద్ ఇప్పుడు 24వ ర్యాంక్‌కు ప‌డిపోయింద‌నే వార్త‌ను మ‌ల్ల‌న్న చ‌దివారు.

హైద‌రాబాద్‌ను ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని కేసీఆర్ అన్నారు. త‌ర్వాత వ‌రంగ‌ల్‌కు వ‌చ్చి హైద‌రాబాద్‌ను త‌ల‌ద‌న్నేలా వ‌రంగ‌ల్‌ను మారుస్తాన‌న్నారు.

బాతాల పోషెట్టి బాత్కానీలు ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేద‌న్నారు. బ‌డికి రప్పించాలె ఫీజులు గుంజాలె అనే వార్త‌పై మ‌ల్ల‌న్న స్పందిస్తూ.. ఈ ప్రైవేటు స్కూల్ యాజ‌మాన్యాల దోపిడీని అరిక‌ట్టాల‌న్నారు.

స‌గం మందికి క‌రోనా వ‌చ్చిపోయింది.. అనే వార్త‌ను మ‌ల్ల‌న్న చ‌దువుతూ మంచి మంచోల్ల‌కు వ‌చ్చింది కానీ రావాల్సినోళ్ల‌కు రాలేద‌న్నారు.

యాంటీ బాడీస్ పెరింద‌ని సీసీఎంబీ స‌ర్వేలో వెల్ల‌డి. భార‌త్‌లో స్వేచ్ఛ లేద‌న్న వార్తపై మ‌ల్ల‌న్న స్పందిస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ‌ద్రోహం అంటున్నారు.

ఎక్క‌డుంది స్వేచ్ఛ అంటూ ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్‌లో నిల‌దాస్తామ‌న్న కేటీఆర్ వార్త‌పై మ‌ల్ల‌న్న స్పందిస్తూ ఖాజీ పేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాట్టుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ విష‌యంలో బీజేపీ పాప‌మెంతుందో టీఆర్ఎస్ పాపం కూడా అంతే ఉంద‌న్నారు. ఇంకా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మ‌ల్ల‌న్న చెప్పారు.