
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు-2021కు ఎంపికయ్యారు.
అమెరికాకు చెందిన మల్టీ ఎథినిక్ అడ్వయిజరీ టాస్క్‌ఫోర్స్ అనే సంస్థ గ్లోబల్ ఉమెన్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు గవర్నర్‌ను ఎంపిక చే సింది.
ప్రపంచవ్యాప్తంగా సమాజహితం కోసం అత్యున్నత సేవలందించిన మహిళలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
ఎంఈఏటీఎఫ్‌ను అమెరికాకు చెందిన రాజకీయ నేత డాని కే డేవిస్ 2010లో స్థాపించారు.
ఈ సంస్థ ప్రధానంగా మైనార్టీల హక్కులను కాపాడుతుంది. పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఈనెల 7వ తేదీన జరిగే 9వ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో ఈ అవార్డును అమెరికా నుంచి గవర్నర్‌కు ప్రదానం చేయనున్నారు.
ఈ అవార్డును అందుకోనున్నవారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తో పాటు 20 మంది ప్రముఖులు ఉన్నారని రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.