దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీతో సూపర్ స్టార్… పిక్ వైరల్

442
Mohanlal's pic with Dulquer Salmaan Family

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మోహన్ లాల్… స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ అమల్ సుఫియా, మర్యమ్ అమీరా సల్మాన్ లతో కన్పిస్తున్నారు.

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీతో మోహన్ లాల్ కలిసి ఉన్న ఫోటో నెట్టింట్లోకి రావడం ఇదే మొదటిసారి.

ఈ ఫొటోలో దుల్కర్ సల్మాన్ తన కూతురును ఎత్తుకోగా, మోహన్ లాల్… దుల్కర్ సల్మాన్ కూతురికి ఏదో చూపిస్తున్నాడు.

ఇక దుల్కర్ సల్మాన్ భార్య ఆకుపచ్చ ఆకుల డిజైన్ తో ఉన్న వైట్ సల్వార్ ధరించింది.

ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్ తన కూతురుతో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇక దుల్కర్ సల్మాన్, అమల్ సూఫియా 2011 అక్టోబర్ 22న పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు 2017 మేలో మర్యమ్ అమీరా సల్మాన్ జన్మించింది.

కాగా కరోనా నేపథ్యంలో వచ్చిన లాక్ డౌన్ సమయంలో మోహన్ లాల్ తన ఫ్యామిలీతో కేరళలో గడిపారు.

ఇక మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ “దృశ్యం” సీక్వెల్ “దృశ్యం-2” విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.