
పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పెళ్ళికి సంబంధించిన వార్తలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మెహ్రీన్ అదంతా నిజమేనని వెల్లడించింది.
జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని మెహరీన్ వివరించారు.
కాగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఈ మెహ్రీన్ వివాహం జరగనుంది.
రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో మార్చి 13న మెహ్రీన్-భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థ వేడుక జరగనుంది.
ఇక మెహ్రీన్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” సినిమాతో తెలుగు సినిమారంగంలోకి తెరంగేట్రం చేసింది.
ఈ సినిమాలో హీరో నాని సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈ బ్యూటీ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అందులో ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్-2’, ‘కవచం’ సినిమాలు భారీ హిట్ అయ్యాయి.
ప్రస్తుతం మెహరీన్ అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్3’లో ఆమె నటిస్తోంది. ఇక 2017లోనే “ఫిల్లౌరీ” అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మెహ్రీన్.