
తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలంలో నాగోబా జాతర రంగ రంగ వైభవంగా కొనసాగుతోంది.
ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను సమర్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రముఖులు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు దత్తాత్రేయకు స్వాగతం పలికారు.
సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. ఆలయంలో దత్తన్న నాగోబాకు ప్రత్యేక పూజలు సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలాంతా క్షేమంగా ఉండాలని నాగోబాకు మొక్కుకున్నట్లు తెలిపారు.
గిరిజనుల సాధికారత కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచించారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపర్చాలని అన్నారు.
ఆయన వెంట ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐటీడీఏ పీవో బవేష్ మిశ్రా, తదిరులు ఉన్నారు.