కాబోయే భర్తకు బర్త్ డే విషెస్ తెలిపిన మెహ్రీన్

268
Mehreen kaur birthday wishes to her husband

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ వివాహం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరగనుంది.

రాజస్థాన్‌లోని జైపూర్‌ అలీలా కోటలో మార్చి 13న మెహ్రీన్-భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థ వేడుక జరగనుంది.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు త‌న‌కు కాబోయే భ‌ర్త భ‌వ్యకు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ అతనితో దిగిన ఫొటో షేర్ చేసింది మెహ్రీన్.

ఈ పిక్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాగా వీరిద్దరిపై పెళ్లి వార్త అఫీషియల్ గా ప్రకటించిన తరువాత షేర్ చేసిన మొదటి ఫోటో ఇదే కావడం విశేషం.

నిశ్చితార్థం పూర్తైన కొద్ది రోజులకు వివాహ వేడుక జ‌రిపించ‌నున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెహరీన్‌ చెప్పింది.

ఇక మెహ్రీన్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” సినిమాతో తెలుగు సినిమారంగంలోకి తెరంగేట్రం చేసింది.

ఈ బ్యూటీ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే అందులో ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌-2’, ‘కవచం’ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మెహరీన్ అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్‌3’లో ఆమె నటిస్తోంది.