‘మెహబూబా’ ట్రైలర్

455
mehabooba-trailer-released

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మెహబూబా’. ఈ సినిమా మే 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఆకాష్ పూరీ యాక్టింగ్ సీన్లు..డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం. మళ్ళీ మళ్లీ పుడతాం’ అంటూ ఆకాష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. పైసా వసూల్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం మెహబూబా. దేశాన్ని ప్రేమించే మనసు ఓ సైనికుడికి మాత్రమే ఉంటుంది.


ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలూ.. అసలీ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది.. అంటూ హీరోయిన్‌ చెప్పే డైలాగులు, మమల్ని చంపేస్తే మళ్లీ పుడతాం, మళ్లీ మళ్లీ పుడతాం.. చివర్లో సల్మాన్‌, షారూఖ్‌, అమీర్‌, అబ్దుల్‌ కలాం, మేరీ మెహబూబా… జిందాబాద్‌ అంటూ ఆకాశ్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. రవి అనే సైనికుడి పాత్రలో ఆకాశ్‌.. మెహబూబా పాత్రలో నేహా శెట్టి.. వారి మధ్య ప్రణయ గాథగా మెహబూబా చిత్రం తెరెక్కింది. పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ బ్యానర్‌పై పూరీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న మెహబూబా.