శర్వానంద్,కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలలో సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం రణరంగం. ఇటీవల సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది .సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ప్రశాంత్ పిైళ్లె సంగీతం అందించారు.
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల మేకింగ్ చూపించారు. 1980 బ్యాక్‌డ్రాప్ నుంచి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు భిన్న పాత్రల్లో అలరించనున్నాడు.