ప్రముఖ కార్ల తయారీ దారు కంపెనీ రెనాల్ట్ తన అప్‌కమింగ్ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కార్ ధరలు సుమారు రూ. 5 – రూ. 7 లక్షల మధ్యన ఉంటుందని అంచనా. కాంపాక్ట్ ఎంపీవీ క్రాస్ఓవర్, ట్రైబర్ అధికారిక బుకింగ్‌లను ఆగస్టు 17నుంచి ప్రారంభిస్తామని రెనాల్ట్ కంపెనీ ప్రకటించింది. రెనాల్ట్ వెబ్‌సైట్, లేదా దగ్గరిలోని బ్రాండ్ డీలర్ ద్వారా కేవలం 11,000 రూపాయలు చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
మారుతి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ లాంటి వాటికి రెనాల్ట్ ట్రైబర్ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, రెనాల్ట్ ట్రైబర్ లో 4 ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్ లు, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరాను జోడించింది.
ఆగస్టు 28 న రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కానుంది. రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లతో ఇది లాంచ్ కానుంది. 72 బిహెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ , 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ అప్షన్స్‌లలో రానుంది. ట్రైబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, రూఫ్ స్పోర్టివ్ లుక్‌తో వస్తున్న ఈ కారులో మూడో వరుసలో ఉన్న సీట్లను అవసరం లేకపోతే.. పూర్తిగా తొలగించుకునే అవకాశం కల్పించింది.