గోవాలో మహేష్, కీర్తి డ్యూయెట్?

304
Mahesh Babu and Keerthy Suresh wrap up the first schedule of Sarkaru Vaari Paata

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ ‘సర్కారు వారి పాట’ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు

గ‌త నెల రోజులుగా దుబాయ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న చిత్రబృందం తాజాగా ఆ షెడ్యూల్ ఫినిష్ చేసేసింది.

దుబాయ్ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు మహేష్, కీర్తిసురేష్‌ల‌పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. అక్కడ మహేష్ బాబు ఇంట్రడక్షన్ ఫైట్ కంప్లీట్ చేశారట.

ఇక తదుపరి షెడ్యూల్ గోవాలో ఉండనుందట. గోవా బీచ్‌లో మహేష్, కీర్తిసురేష్‌ల‌పై స్పెషల్ డ్యూయెట్‌ ప్లాన్ చేశారట దర్శకుడు పరశురామ్. దుబాయ్ నుంచి నేరుగా గోవా వెళ్లనుందట ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం.


బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.