సోషల్ మీడియాలో దుష్ప్రచారం… సైబర్ క్రైంలో మాధవీలత ఫిర్యాదు

191
Madhavi Latha Give The Complaint To CP Sajjanar

టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. మొదటి నుండి తనపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాధవీలత.

తన రాజకీయ ప్రవేశం తరువాత తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు చెందినవారు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల అంశం గురించి మాట్లాడటంతో ఈ వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు.

అంతేకాదు వాట్సాప్ లలో కొన్ని గ్రూపులు స్క్రీన్ షాట్ లు చేసి మరి ఫార్వర్డ్ చేస్తున్నారని, అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కరీనా చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు.

ఈ మేరకు మాధవీలత సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టుకోకపోతే మౌనదీక్షకు దిగుతానని మాధవీలత వెల్లడించారు.

ఒక సినిమాలో తాను నటించిన ఒక పాటకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నువ్వు హిందువువా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారని, హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ గా నటించకపోతే ఇంకేం చేస్తారంటూ మండిపడ్డారు.