ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు!

133

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కోదాడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌ ను దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్‌ ఎ 1 నిందితుడుగా కాగా, ఎ 2, ఎ 3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది. ఈ కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.