‘భరత్ అనే నేను’పై కత్తి మహేష్ రివ్యూ

462
kathi-mahesh-review-on-bharath-ane-nenu-movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఒక్క సినిమా..హై ఎక్స్ పెక్సేషన్స్ తోనే రిలీజవుతుంది. కానీ భరత్ అనే నేను సినిమా మాత్రం ఇంకాస్త ప్రత్యేకం. అందుకే ఈ సినిమా మహేశ్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో సందడి చేస్తోంది. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌ మరింత జోష్‌లో ఉన్నారు.

ఈ సినిమాపై కత్తి మహేష్ రివ్యూ ఇచ్చారు.‘‘భరత్ అనే నేను సినిమా సింపుల్ స్టోరీ కానీ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మహేష్ తన క్యారెక్టర్‌లో లీనమైపోయి నటించారు. కొరటాల శివ నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదైతే కచ్ఛితంగా సాధ్యమవుతుందో దానిని కళ్లకు కట్టినట్టు చూపించారు. భరత్ అనే నేను ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్లి చూడండి’’ అంటూ కత్తి మహేష్ తన రివ్యూలో పేర్కొన్నారు.