యంగ్ హీరో సుమంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కపటధారి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఎస్‌ఐగా కనిపించనున్నారు. కన్నడ చిత్రం ‘కావలుధారి’కి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందితాశ్వేత హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా సుమంత్ పుట్టినరోజు ట్రీట్ గా “కపటధారి” చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. “మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని స్కెలిటన్స్ బయట పడ్డాయి అంటూ మొదలైన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.
ఒక డెత్ మిస్టరీని ట్రాఫిక్ పోలీస్ అయిన సుమంత్ ఎలా చేధించాడు ? ఈ క్రమంలో ఆ ట్రాఫిక్ పోలీస్ కు ఎదురైన సవాళ్లేంటి ? ఇందులో “కపటధారి” ఎవరు ? అనేది ఈ క్రైమ్ థ్రిల్లర్ కథాంశం. ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
“కపటధారి” సినిమా ఫిబ్రవరి 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాజర్, జయప్రకాశ్, సుమన్ రంగనాథ్, వెన్నెల కిషోర్, సంపత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కు సైమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో సుమంత్ మంచి జోరుమీదున్నారు. వరుస సినిమాలతో సిద్ధమవుతున్నారు.