బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భూమిపై ఉన్న ఇద్దరు ప్రముఖ నటీమణులతో ఆమెను పోల్చుకున్నారు కంగనా.
“ఒక నటిగా నేను చూపించే ఈ స్థాయిని ప్రస్తుతం ఈ భూగోళంలో మరే నటి చూపించలేదు.
మెరిల్ స్ట్రీప్ (ప్రముఖ హాలీవుడ్ నటి) మాదిరిగా వైవిధ్యమైన పాత్రలు చేసే రా టాలెంట్ నాలో ఉంది.
అలాగే, గాల్ గాడోట్ (ప్రముఖ ఇజ్రాయిల్ నటి) మాదిరిగా యాక్షన్ చేయగలను, గ్లామర్‌గా కనిపించగలను” అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు కంగనా రనౌత్.
I am open for debate if anyone can show me more range and brilliance of craft than me by any other actress on this planet I promise to give up my arrogance, until then I can surely afford the luxury of pride #Thalaivi #Dhaakad pic.twitter.com/0RXB1FcM43
— Kangana Ranaut (@KanganaTeam) February 9, 2021
“నా కన్న గొప్పగా, అద్భుతంగా నటించే నటి ఈ భూమి మీద ఉందని నాకు చూపిస్తే నేను డిబేట్‌కు సిద్ధం. ఒక వేళ మీరు నిరూపిస్తే నేను నా అహంకారాన్ని వదులు కుంటున్నానని మాటిస్తున్నాను.
అప్పటి వరకు ‘తలైవి’, ‘ధాకడ్’ గర్వాన్ని మీకు అందించగలను” అని కంగనా మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా కంగనా ఇప్పటికే “తలైవి” సినిమాను పూర్తి చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
ఇక కంగనా తన తదుపరి చిత్రం ‘ధాకడ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది.