93వ ఆస్కార్ : లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ లిస్ట్ లో “బిట్టూ”

176
Oscar 2021: live action short ‘Bittu’ still in fray

93వ ఆస్కార్ అవార్డ్స్ కు ఈసారి 93 దేశాల నుంచి సినిమాలు ఈ కేట‌గిరీకి అర్హ‌త సాధించాయి.

ఇండియాకు చెందిన షార్ట్ ఫిలిం “బిట్టూ” మాత్రం టాప్ 10 షార్ట్ ఫిల్మ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించింది.

ఇద్ద‌రు స్కూలు విద్యార్థుల మ‌ధ్య ఉన్న స్నేహంపై తీసిన ఈ షార్ట్‌ఫిల్మ్ ఒక నిజ‌మైన స్టోరీ కావ‌డం విశేషం. మార్చి 15న ఆస్కార్స్‌కు నామినేష‌న్లు ప్ర‌క‌టించ‌నున్నారు.

ఏప్రిల్ 25న బ‌హుమ‌తుల ప్ర‌దానోత్స‌వం ఉంటుంది.

క‌రిష్మా దేవ్ దూబె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బిట్టూ లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్ కేట‌గిరీకి షార్ట్‌లిస్ట్ కావడం విశేషం. అకాడ‌మీ బుధ‌వారం 9 కేట‌గిరీల‌కు చెందిన షార్ట్‌లిస్ట్‌ల‌ను ప్ర‌కటించింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్‌, డాక్యుమెంట‌రీ, ఒరిజిన‌ల్ స్కోర్‌, ఒరిజిన‌ల్ సాంగ్‌, మేక‌ప్ అండ్ హెయిర్‌స్టైలింగ్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, లైవ్ యాక్ష‌న్ షార్ట్‌ఫిల్మ్‌, డాక్యుమెంట‌రీ షార్ట్ స‌బ్జెక్ట్‌, ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కేట‌గిరీల‌కు షార్ట్‌లిస్ట్‌ల‌ను ప్ర‌క‌టించారు.

ఈ లిస్ట్‌ల నుంచి అకాడ‌మీ ఇప్పుడు ఆస్కార్స్ 2021కు నామినీల‌ను ఎంపిక చేస్తుంది.

అయితే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీకి ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన జ‌ల్లిక‌ట్టు షార్ట్‌లిస్ట్ అయిన 15 సినిమాల జాబితాలో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది.