ఈ చికెన్ చాలా కాస్లీ గురూ!

260

పురుషుల‌లో పుణ్య‌పురుషులు వేర‌యా అన్న‌ట్టు చికెన్‌ల‌లో ఈ చికెన్ చాలా ప్ర‌త్యేక‌మైంది. ఇది ఓ ప్ర‌త్యేక‌మైన జాతి కోడి.

దీని మాంసం ప్ర‌స్తుతం మార్కెట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే క‌డ‌క్‌నాథ్ కోడి. బ్రాయిలక్ కోడి కంటే నాటు కోడి మాంసం రేటు మార్కెట్‌లో ఎక్కువ‌గా ఉంటుంది.

మామూలుగా బ్రాయిల‌ర్ కోడి మాంసం కిలో రూ. 200 అంటే అమ్మో అంత రేటా అనుకుంటాం. కానీ ఈ క‌డ‌క్‌నాథ్ కోడి మాంసాన్ని సామాన్యులు తిన‌లేరేమో.

సాధారణంగా ఎవరికన్నా జ‌లుబు చేస్తే ‘మాంచి నల్లకోడి మాంసం’తినాలిరా అప్పుడుగానీ ఈ జలుబు తగ్గదు అంటారు. అదిగో ‘కడక్‌నాథ్‌ కోళ్లు’ అలాగే ఉంటాయి.

నల్లటి నలుపు రంగులో ఉంటాయి. ఈ కోడి మాంసానికి మంచి డిమాండ్ కూడా ఉంది. దీని రేటు చూస్తే వ‌డ‌గాలి త‌గిలిన‌ట్టు సొమ్మ‌సిల్లి పోతారు. ఎందుకంటే ఈ కోడి మాంసం కిలో అక్షరాలా రూ.1200లు!

‘కడక్‌నాథ్‌ కోడి’ మాంసం మార్కెట్‌లో కిలో వెయ్యి నుంచి 12 వందల రూపాయల వరకూ ఉంటుంది. అమ్మో అంత ఖరీదా? మటన్ రేటును మించిపోయిందే? ఏంటో అంత స్పెషాలిటీ అనుకుంటున్నారు కదూ.

ఈ కోడి పేరే కాదు రూపం దగ్గర్నుంచి అన్నీ స్పెషలేనట. అందుకే హైదరాబాదులో మాంసం మార్కెట్‌లో కడక్‌నాథ్ చికెన్‌ కిలో 1000 నుంచి రూ 1200 వరకు పలుకుతోంది.

కడక్‌నాథ్ కోడి మాంసం నల్లటి రంగులో నిగనిగలాడుతుంటుంది. కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.ఈ చికెన్ లో కొవ్వు పదార్ధం అతి తక్కువగా ఉంటుంది.

మాంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధర భారీగా పలుకుతోంది.

దీనికోసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు మాంసాహార ప్రియులు. సాధారణంగా కడక్‌నాథ్ బ్రీడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది.

ఈ కోడి మొత్తం నలుపురంగులోనే ఉంటుంది. దీని గుడ్లు కూడా నల్లగా ఉంటాయి. కానీ కాస్త ముదురు కాఫీ రంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి.

కడక్‌నాథ్ కోళ్లను మాంసం, గుడ్లు కోసమే పెంచుతారు. ఈ కడక్‌నాథ్ కోళ్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాయి.