
వీధిలో నివసిస్తున్నవారికి దంపతులిద్దరు స్వీట్లు పంపిణీ చేసి, పథకం ప్రకారం వారి ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని బుట్టిగుడ వీధిలో చేసుకుంది.
ఆ వీధిలో నివసించే ఉషా పటేల్ అనే మహిళ ఇంట్లో సుభాష్ దంపతులు మూడు నెలల నుంచి అద్దెకు ఉంటున్నారు.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని సుభాష్ చెబుతూ ఉండేవాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం రెండు రోజుల క్రితం సాయంత్రం బయటకు వెళ్లి ఇంటికి స్వీట్లు పట్టుకొచ్చాడు.
తనకు మంచి ఉద్యోగం వచ్చిందని ఇంటి యజమానితో పాటు వీధిలోని చాలా మందికి మత్తు మందు కలిపిన స్వీట్లు పంపిణీ చేశాడు.
కాసేపటికి స్వీట్లు తిన్న వారంతా మత్తులోకి జారుకోవడంతో రాత్రి 10 గంటలకు తన భార్యతో కలిసి సుభాష్ తమ యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారంతో పాటు రూ.2.5 లక్షల నగదును దోచుకెళ్ళాడు.
అదేవిధంగా స్వీట్లు తిని పడిపోయిన మరో ఏడు ఇళ్లలోనూ చోరీ చేసి భార్యతో కలసి పారిపోయాడు.
బాధితు ఫిర్యాదు మేరకు పారిపోయిన జంట కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.