యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)’.
తాజాగా ఈ చిత్ర లొకేషన్‌లో రామరాజు, భీమ్ కలిసి కబుర్లు చెప్పుకుంటున్న పిక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. “ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన శక్తివంతమైన క్లైమాక్స్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి” అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Unwinding in the midst of vigorous practice sessions for THE CLIMAX!! 🤩 #RRRMovie #RRR #RRRDiaries pic.twitter.com/OXqHkh4sUc
— RRR Movie (@RRRMovie) February 5, 2021
“ఆర్ఆర్ఆర్” చిత్రంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న “ఆర్ఆర్ఆర్” ప్రేక్షకుల ముందుకు రానుంది. “ఆర్ఆర్ఆర్” చిత్రం విడుదల విషయాన్ని చిత్రయూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.