మహానటి శ్రీదేవి కుమార్తె జాన్వీ నటించిన ‘థడక్’ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే జాన్వీ సినిమా కెరియర్ ప్రారంభించక ముందునుంచే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ ప్రముఖ మ్యాగజైన్ ‘వోగ్’ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఈ నేపధ్యంలో జాన్వీ ముఖచిత్రంతో కూడిన కవర్ పేజీ విడుదలైంది. దీనిని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీనితోపాటు ‘ఈ ఫొటోను షేర్ చేయడాన్ని ఎంతో ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇది మ్యాగజైన్ కోసం నా తొలి కవర్ ఫొటో. ‘వోగ్ ఇండియా’ నాకు ఇంతటి ప్రత్యేక అనుభూతిని కలిగించినందుకు థ్యాంక్స్’ అని కామెంట్ రాసింది. ఈ ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్ అచ్చం శ్రీదేవిలానే ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
‘వోగ్’ కవర్‌పేజీపై జాన్వీ
First Cover. First Interview. First Film. And many more to come.
Presenting Janhvi Kapoor for Vogue India June 2018 Issue. pic.twitter.com/zix7xfWvDd
— Janhvi Kapoor Fanpage (@JanhviKapoorFP) May 30, 2018
‘వోగ్’ కవర్‌పేజీపై జాన్వీ
‘వోగ్’ కవర్‌పేజీపై జాన్వీ