ఇంటి ఓనర్ తనపై దాడి చేశారని టీవీ ఆర్టిస్ట్ జబర్దస్త్ వినోద్ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరు వ్యక్తులతో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు.
గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమీల, బాలాజీకు రూ.10లక్షలు ఇచ్చామని, వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్ చేసుకుందామని రమ్మని హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రగాయాలపాలైన వినోద్.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వినోద్‌పై దాడి కేసు.. నిందితుల రిమాండ్
జబర్ధస్త్ వినోద్‌కుమార్, అతని తల్లి శిరోమణెమ్మపై దాడిచేసి దూషించిన ఇంటి యాజమాని, కుటుంబ సభ్యులకు సోమవారం నగరంలోని నాంపల్లిలోని 4వ ఏసీ ఎంఎం కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
కాచిగూడ పోలీసుల కథనం ప్రకారం… కడప జిల్లాకు చెందిన అప్పయిపల్లి వినోద్‌కుమార్(24) బుల్లితెర జబర్ధస్త్‌లో లేడి ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కుద్బిగూడలోని ఓ ఇంట్లో తల్లి శిరోమణెమ్మతో అద్దెకు ఉంటున్నా డు. కాగా.. ఇంటి యజమాని బాలాజీ, అతని భార్య ప్రమీల తమకున్న 70 గజాల ఇంటి స్థలంలో 38 గజాలు అమ్ముతానని చెప్ప గా .. వినోద్ మొదట రూ.10 లక్షలు, మరోసారి రూ.8 లక్షలు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత యజమాని నీ డబ్బులు వాపస్ ఇస్తానని, ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు.
ఈ క్రమంలో ఈ నెల 19న ఇంటి యాజమాని బాలాజీ, భార్య ప్రమీల, కుమారులు ఉదయ్‌సాగర్, అభిషేక్, కోడలు సంధ్యలు వారిని కులం పేరుతో దూషించి, దాడిచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 5 మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. సోమవారం ఆ ఐదు మంది కుటుంబ సభ్యులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం చెంచల్‌గూడ జైలుకు తరలించారు.