ఈ ఏడాది ఐపీఎల్ కోసం గురువారం (18-2-2021) జరిగిన వేలంలో విదేశీ ఆటగాళ్ల జోరు కొనసాగినప్పటికీ తమిళనాడుకు చెందిన దేశవాళీ క్రికెటర్ షారూఖ్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆల్ రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఏకంగా రూ. 16.25 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.
దీంతో అతను ఐపీఎల్ వేలంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్న మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. తర్వాత బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌ను రూ. 3.20 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీని రూ. 7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. తర్వాత కృష్ణప్ప గౌతమ్ రూ. 9.25 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాడు.
ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తర్వాత కైల్ జెమీసన్‌ను రూ. 15 కోట్ల భారీ ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు దక్కించుకుంది.
ముంబై ఇండియన్స్‌కు అర్జున్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.
అర్జున్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడకపోవడంతో స్వల్ప ధరకే ముంబై సొంతం చేసుకుంది. అర్జున్ బిడ్‌తో ఐపీఎల్ 2021 మిలీ వేలం ముగిసింది. అయితే అర్జున్ ఐపీఎల్ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వేలం ప్రారంభమైనప్పటి నుంచి నెటిజన్లు అర్జున్ టెండూల్కర్ బిడ్ కోసం తెగ సర్చ్ చేశారు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించలేకపోయిన అర్జున్ విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేసిన ముంబై సీనియర్ జట్టులో చోటు కోల్పోయాడు.
ఈ ఐపీఎల్‌లో అర్జున్‌ను ముంబై జట్టు కొనుగోలు చేస్తుందని అభిమానులు ముందుగానే ఊహించారు. స్టార్ పేస్ బౌలర్లు ఉన్న ముంబై జట్టులో అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.
షారూఖ్ ఖాన్‌కు కనక వర్షం
ఈ ఐపీఎల్‌లో షారుక్‌ఖాన్ కనీస ధర: రూ. 20లక్షలు. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఒక అనామకుడైన క్రికెటర్‌కు వేలంలో ఇంత భారీ మొత్తం లభించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. తమిళనాడుకు చెందిన షారుక్‌ను పంజాబ్ జట్టు ఇంత పెద్ద మొత్తానికి కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలో షారుక్‌ఖాన్ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే.
అమ్ముడుపోయిన ఆటగాళ్లు
- స్టీవ్ స్మిత్ (ఢిల్లీ క్యాపిటల్స్)- రూ. 2.20 కోట్లు
- గ్లేన్ మ్యాక్స్‌వెల్ (ఆర్‌సీబీ)-రూ. 14.25 కోట్లు
- షకీబ్ అల్ హసన్(కేకేఆర్)- రూ.3.20 కోట్లు
4. మోయిన్ అలీ(సీఎస్‌కే)-రూ. 7 కోట్లు
5. శివమ్ దూబే(రాజస్థాన్)-రూ. 4.40 కోట్లు
6.క్రిస్ మోరీస్(రాజస్థాన్)-రూ.16.25 కోట్లు
7. డేవిడ్ మలాన్(పంజాబ్)-రూ.1.50 కోట్లు
8. ఆడమ్ మిల్నే(ముంబై)-రూ. 3.20 కోట్లు
9. ముస్తాఫిజుర్ రెహ్మాన్(రాజస్థాన్)- రూ. కోటి
10. జై రిచర్డ్సన్(పంజాబ్)- రూ.14 కోట్లు
11. నాథన్ కౌల్టర్ నైల్(ముంబై)-రూ. 5 కోట్లు
12. ఉమేశ్ యాదవ్(ఢిల్లీ)-రూ. కోటి
13. పియూష్ చావ్లా(ముంబై)-రూ.2.40 కోట్లు
14. సచిన్ బేబీ(ఆర్‌సీబీ)-రూ.20 లక్షలు
15. రజత్ పటిదర్(ఆర్‌సీబీ)-రూ.20 లక్షలు
16. రిపల్ పటేల్(ఢిల్లీ)-రూ.20 లక్షలు
17. షారూఖ్ ఖాన్(పంజాబ్)- రూ.5.25 కోట్లు
18. కృష్ణప్ప గౌతమ్(చెన్నై)- రూ.9.25 కోట్లు
19. విష్ణు వినోద్ (ఢిల్లీ)- రూ.20 లక్షలు
20. షెల్డన్ జాక్సన్ (కోల్‌కతా)-రూ. 20 లక్షలు
21. మహ్మద్ అజారుద్దీన్(ఆర్‌సీబీ)- రూ.20 లక్షలు
22. లుక్మాన్ హుస్సేన్ (ఢిల్లీ)- రూ.20 లక్షలు
23. చేతన్ సకారియా (రాజస్థాన్)-రూ. 20 లక్షలు
24. రిలే మెరెదిత్ (పంజాబ్)-రూ. 8 కోట్లు
25. సిద్దార్థ్ (ఢిల్లీ)- రూ. 20 లక్షలు
26. జగదీషా సుచిత్ (హైదరాబాద్)- రూ. 30 లక్షలు
27. కరియప్పా(రాజస్థాన్)- రూ. 20 లక్షలు
28. చతేశ్వర్ పుజారా (చెన్నై)-రూ. 50 లక్షలు
29. కైల్ జేమీసన్ (ఆర్‌సీబీ)- రూ. 15 కోట్లు
30. టామ్ కరన్ (ఢిల్లీ)-రూ. 5.25 కోట్లు
31. హెన్రీక్స్ (పంజాబ్)- రూ.4.20 కోట్లు
32. జలజ్ సక్సెనా (పంజాబ్)- రూ.30 లక్షలు
33. ఉత్కర్ష్ సింగ్( పంజాబ్)- రూ.20 లక్షలు
34. వైభవ్ అరోరా (కోల్‌కతా)- రూ. 20 లక్షలు
35. ఫాబియన్ అలెన్ (పంజాబ్)- రూ. 75 లక్షలు
36. డానియల్ క్రిస్టియన్ (ఆర్‌సీబీ)- రూ.4.8 కోట్లు
37. లియమ్ లివింగ్ స్టోన్ (ఆర్‌సీబీ)- రూ. 75 లక్షలు
38. సుయాశ్ ప్రభుదేశాయ్ (ఆర్‌సీబీ)- రూ. 20 లక్షలు
39. కేఎస్ భరత్ (ఆర్‌సీబీ)- రూ. 20 లక్షలు
40. హరిశంకర్ రెడ్డి (చెన్నై)- రూ. 20 లక్షలు
41. కుల్దీప్ యాదవ్ (రాజస్థాన్)- రూ.20 లక్షలు
42. జేమ్స్ నీషమ్ (ముంబై)- రూ. 50 లక్షలు
43. యుద్‌వీ చరక్ (ముంబై)- రూ. 20 లక్షలు
44. భగత్ వర్మ (చెన్నై)- రూ. 20 లక్షలు
45. మార్కో జాన్‌సెన్ (ముంబై)- రూ. 20 లక్షలు
46. కరుణ్ నాయర్ (కోల్‌కతా)- రూ. 50 లక్షలు
47. కేదార్ జాదవ్ (హైదరాబాద్)- రూ. 2 కోట్లు
48. సామ్ బిల్లింగ్స్ (ఢిల్లీ)- రూ. 2 కోట్లు
49. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (హైదరాబాద్) రూ. 1.5 కోట్లు
50. హర్భజన్ సింగ్ (కోల్‌కతా)- రూ. 2 కోట్లు
51. హరి నిశాంత్ (చెన్నై)- రూ. 20 లక్షలు
52. బెన్ కట్టింగ్ (కోల్‌కతా)- రూ. 75 లక్షలు
53. వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా)- రూ. 20 లక్షలు
54. పవన్ నేగీ (కోల్‌కతా)- రూ. 50 లక్షలు
55. ఆకాశ్ సింగ్ (రాజస్థాన్)- రూ.20 లక్షలు
56. అర్జున్ టెండూల్కర్ (ముంబై)-రూ. 20 లక్షలు
అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు..
1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)
2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)
3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
5. హనుమ విహారీ(భారత్)
6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)
7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)
8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)
9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)
10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)
11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)
12. వరుణ్ ఆరోన్ (భారత్)
13. మోహిత్ శర్మ(భారత్)
14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)
15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)
16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)