టక్ జగదీష్ : “ఇంకోసారి ఇంకోసారి” లిరిక‌ల్ వీడియో సాంగ్

530
Inkosaari Inkosaari​ Lyrical Video From Tuck Jagadish​

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని 26వ చిత్రమైన “టక్ జగదీష్”కు తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా “టక్ జగదీష్” చిత్రం నుంచి “ఇంకోసారి ఇంకోసారి” అనే పాట లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు.

నాని, రీతూ వర్మపై చిత్రీకరించిన ఈ సాంగ్ ను శ్రేయ ఘోషల్, కాల భైరవ ఆలపించారు.

చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ను మీరు కూడా వినండి.

గ‌త ఏడాది “వి” చిత్రంతో ఫర్వాలేదన్పించాడు నాని. ఆ తరువాత ‘నిన్నుకోరి`వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన శివనిర్వాణ దర్శకత్వంలో మరోసారి “టక్ జగదీష్” అంటూ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు నాని.

ఏప్రిల్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు ఇప్పటికే మొద‌లు పెట్టారు.