ఒక్క హీరోకి వచ్చిన ఛాన్స్… కొన్ని కారణాల వల్ల మరో స్టార్ కి దక్కుతుంది. కొందరి సినిమా ఇంకొందరికి బెడిసికొడుతుంది. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఫేస్ చేసారు. ఇప్పుడు వరుణ్ తేజ్, రామ్ కూడా ఇలాంటి అనుభవాన్ని చూసారు.
వరుణ్ తేజ్… మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా… తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. డిఫరెంట్ సబ్జెక్ట్స్… డిఫరెంట్ రోల్స్ తో కెరీర్ నీ చక్కగా తీర్చిదిద్ది కుంటున్నాడు. కంచె సినిమాలో సైనికుడిగా… తొలిప్రేమ లో లవర్ బాయ్ గా… అంతరిక్షంలో ఆస్ట్రోనాట్ గా మెప్పించిన వరుణ్… ఎఫ్2 లో కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత వస్తున్న వాల్మీకి చిత్రంలో నెగటివ్ షేడ్స్ రోల్ లో కనిపించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఐతే ఈ సినిమా కి ముందు అయ్యారే మూవీ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో వరుణ్ సినిమా చేయాల్సి ఉండేదట. ఆ సినిమాని 14 రీల్స్ సంస్థ నిర్మించాల్సి ఉండేది. ఐతే… సాగర్ చంద్ర కథ లో పాయింట్ కు కన్నెక్ట్ అయిన వరుణ్… తర్వాత కథ డెవలప్మెంట్ నచ్చకపోవడంతో సైడ్ అయిపోయాడట. ఆ తర్వాత హరీష్ శంకర్ వాల్మీకి సినిమాకీ వరుణ్ కి ఓకే చెప్పడంతో 14 రీల్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది అన్న మాట.
కాగా… ఇదే పాయింట్ స్టోరీ తో సాగర్ చంద్ర… హీరో రామ్ నీ కలవగా సినిమాకీ ఒకే చెప్పాడట. ఈ సినిమాను రామ్ ఫ్యామిలీ బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మించనుంది అని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వరుణ్ ప్లేస్ లో ఎంటర్ అయినా రామ్ కు సినిమా కలిసివస్తుంది లేకా నిరాశ మిగులుస్తుంది చూడాలి మరి.