అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.
జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.
గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనేతాజాగా ఈ చిత్రం నుంచి ప్రేమికుల రోజు కానుకగా రొమాంటిక్ సాంగ్ ‘గుచ్చే గులాబీలాగా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.
ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, టీజర్, సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మనసా’ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ చిత్రంతోనైనా అఖిల్ హిట్ అందుకుని అక్కినేని అభిమానులను ఖుషి చేస్తాడేమో చూడాలి.