గోపిచంద్ ‘పంతం’ టీజర్ విడుద‌ల‌

869
gopichand-pantham-movie-teaser-released

మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న గోపిచంద్ ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో గోపిచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సీరియ‌స్ లుక్‌తో క‌నిపిస్తున్న గోపించంద్ పోలీస్ గెట‌ప్‌లో ర‌ఫ్ఫాడిస్తున్నాడు . పంతం అనే టైటిల్‌కి ఫ‌ర్ ఏ కాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాతో త‌ప్ప‌క స‌క్సెస్ సాధించాల‌నే క‌సితో గోపిచంద్ ఉన్నాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా… ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కెకె రాధామోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. వ‌చ్చే నెల‌లో సినిమాని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. మ‌రి తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.గోపిచంద్ ‘పంతం’ టీజర్ విడుద‌ల‌

మాస్ ఆడియన్స్‌‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించిన గోపీచంద్ హిట్ కొట్టేందుకు ఈసారి పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌ను ఎంచుకున్నారు. పంతం టీజర్‌ లంచగొండి నాయకులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు స్ట్రాంగ్‌గానే క్లాస్ పీకారు.

‘ఫ్రీగా ఇళ్లు ఇస్తాం.. కరెంటు ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఓటుకి ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక, మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి.. కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుండి వస్తాయ్’ అంటూ గోపీచంద్ చెప్తున్న డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. 

‘లోపలున్నది బయటకి తీస్తాం.. బయట ఉన్నది లోపలికి తోస్తాం.. డింగ్ డింగ్’ అంటూ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కామెడీ డైలాగ్ చెప్తున్నా.. ఇందులో చాలా విషయం ఉందని అర్ధమవుతోంది. రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఉన్న అవినీతి సొమ్మును బయటకు తీసి.. ప్రజలకు అందించించడమే గోపీచంద్ ‘పంతం’ అని టీజర్‌ బట్టి అర్ధమౌతోంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ, రొమాన్స్, పొలిటికల్ పంచ్‌లు ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను ‘పంతం’ టీజర్‌లో టచ్ చేశారు గోపీచంద్.