బుల్లితెర బిగ్ రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు సీజన్ 4″లో అఖిల్, మోనాల్ లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ జంట పాపులర్ అయ్యారు.
అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఆన్ స్రీన్ రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒక వెబ్ సిరీస్‌లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు.
ఈ విషయాన్ని అఖిల్, మోనాల్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ సిరీస్‌కు ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే టైటిల్ పెట్టారు.
భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌ను మాస్టర్ అజితేష్ వెంకట్ సమర్పణలో సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎ. భాస్కర్‌రావు నిర్మిస్తున్నారు.
‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, హీరోయిన్ మోనాల్ గజ్జర్, దర్శకుడు భాస్కర్ బంటుపల్లి, నిర్మాత ఎ. భాస్కరరావు పాల్గొన్నారు.
ఇక ఇప్పటికే బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులను అలరించిన మోనాల్, అఖిల్ జంట మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.