నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘లవ్ స్టోరి’ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ప్రేమకథా థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి వాలంటైన్స్ డే కానుకగా “నీ చిత్రం చూసి..” పాట లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రంలో రేవంత్, మౌనికలుగా చైతూ, సాయి పల్లవి నటిస్తున్నారు. ఏప్రిల్ 16న విడుదల కానున్న ఈ చిత్రం గురించి చై, ఐపల్లవి, శేఖర్ కమ్ముల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.