ఇంతవరకు తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘ఉప్పెన’తో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.
విజయ్ సేతుపతి తమిళంలో ఒకవైపు హీరోగా నటిస్తూనే నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.
దీంతో ఆయన నటించిన పాత తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అందులో భాగంగా “సూపర్ డీలక్స్” అనే సినిమాను విడుదల చేస్తుండగా..
తాజాగా “ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్” అనే తమిళ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రధారులుగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొంది తమిళనాట విజయవంతం అయ్యింది ఈ సినిమా.
“ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్” చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ మొత్తానికి సొంతం చేస్తున్నారు.
“ఓ మంచి రోజు చూసి చెప్తా” మూవీని మార్చి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.