గాలి సంపత్ : “ఫిఫిఫీ ఫిఫీఫీ” లిరికల్ వీడియోను విడుదల చేసిన నాని

445
Fififee Fifeefee Lyrical Video from Gaali Sampath

రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ “గాలి సంపత్”. అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సినిమాలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మీమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు.

అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా… సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి తొలిపాట ‘ఫిఫిఫీ ఫిఫీఫీ’ని నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల‌ చేశారు.

ట్విట్టర్ ద్వారా ఈ పాటను విడుదల చేసిన నాని.. “రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణులు గిఫ్టెడ్ యాక్టర్స్‌” అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

“రాజా రాజశ్రీ గాలి సంప‌త్‌ గారు మైడియ‌ర్ డాడీ బాబండీ.. మా బాబుగారు చేసే డైలీ విన్యాసాలు ఊహాతీతం సుమండీ” అంటూ సాగే ఈ పాట‌కి రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా… అచ్చు రాజ‌మ‌ణి మంచి స్వరాలు స‌మ‌కూర్చారు.

రాహుల్ నంబియార్‌, శ్రీకృష్ణ విష్ణుబొట్ల క‌లిసి పాడిన ఈ పాటకు రాజేంద్ర ప్రసాద్ గొంతు కూడా కలిపారు.

అలాగే, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణ.

మీరు కూడా ఈ “ఫిఫిఫీ ఫిఫీఫీ” లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.