మానవుడు నిత్యం ఏదో ఒక పరిశోధన చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఆకాశంలో ఉండే ఇతర గ్రహాలపై ఈ పరిశోధన కొనసాగుతుంటుంది.
ఈ క్రమంలో అంగారకుడిపై కూడా మనుషులు మనుగల సాధించగలరా? అనే దానిపై చేసిన పరిశోధనలో అనేక అంశాలు వెలుగు చూశాయి.
అంగారకుడిపై ఉండే వాతావరణం దాదాపు భూమిపై ఉండే వాతావరణం లాంటిదే అని పరిశోధకులు అంటున్నారు. వాతావరణం చల్లగానూ, పొడిగా ఉండే అంగారకుడి ఉపరితలంపై అతినీలలోహిత కాంతి ప్రసరిస్తుంటుంది.
వాస్తవానికి అక్కడ జీవం ఉందో లేదో మిస్టరీగానే ఉంది. రెడ్ ప్లానెట్‌పై ఒకప్పుడు జీవం ఉండేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ అధ్యయనాల ప్రకారం.. భూమిపై జీవించే జీవులు అంగారకుడిపై తాత్కాలికంగా మనుగడ కొనసాగించగలవని చెబుతున్నాయి. దీనిపై పరిశోధకులు సైతం లోతుగా అధ్యయనాలు చేస్తున్నారు.
ఒక బెలూన్‌లో బ్యాక్టీరియా, ఫంగీలను స్ట్రాటో ఆవరణంలోకి పంపినపుడు అక్కడి ప్రాంతంలో మార్టియన్ అంగారకుడి వాతావరణ పరిస్థితులను కల్పించి పరిక్షించారు.
అలాగే సూర్యుని నుంచి యూవీ రేడియేషన్ ప్రతిబింబించేలా చూశారు. ఇందులో అన్ని సూక్ష్మజీవులు తట్టుకోలేకపోయాయి.
కానీ వాటిలో కొన్ని బాక్టీరియాలు మాత్రం యూవీ కాంతిని తట్టుకుని జీవించ గలిగాయి. రెడ్ ప్లానెట్‌లో మనుగడ సాధ్యమే అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధకులు మార్టిన్ ఉల్క నుండి పొందిన మట్టిపై సూక్ష్మజీవులను పెంచారు. ఈ ఉల్క నార్త్‌వెస్ట్ ఆఫ్రికా (NWA) 7034ను ఉపయోగించింది.
4.5 బిలియన్ ఏళ్ల నాటి అంగారక గ్రహానికి చెందిన ఒక ముక్క భాగం. రెడ్ ప్లానెట్‌పై ఆదిలో కెమోలిథోట్రోఫ్స్‌తో సమానమైన జీవం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.