దసరా పండుగపైనే దృష్టిపెట్టిన ‘డిస్కోరాజా’

262
'DiscoRaza'

రవితేజను ఈ మధ్య పరాజయాలు సతమతం చేస్తున్నాయి. దాంతో తన తదుపరి సినిమాతో తప్పకుండా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ప్రస్తుతం ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టింది. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బాబీసింహా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రవితేజ ఎప్పుడు వస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. రవితేజ మాత్రం దసరాకి థియేటర్లకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాను దసరాకి రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ప్రాజెక్టును కూడా రవితేజ పట్టాలకెక్కించనున్నట్టు సమాచారం. తమిళంలో హిట్ కొట్టిన విజయ్ ‘తెరి’కి ఇది రీమేక్.