రాఖీ సావంత్‌ రహస్య వివాహం పై దీపక్‌ 4 కోట్లు డిమాండ్‌

285

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ రహస్యంగా వివాహం చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్‌ ఖలాల్‌ షాక్‌ అయ్యారు. దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ సావంత్‌ ప్రకటించారు. ఆ తర్వాత దీపక్‌ని వివాహం చేసుకోవడం లేదని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం రాఖీ ఓ ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశారు. అయితే తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భర్త పెళ్లి తర్వాత యూకే వెళ్లిపోయారు. నా వీసా రావాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తా. అక్కడే మేం స్థిరపడతాం’ అని చెప్పారు.

ఈ నేపథ్యంలో రాఖీ తనను మోసం చేసిందంటూ దీపక్‌ ఖలాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు నాలుగు రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించారు. అయితే దీపక్‌ వ్యాఖ్యల్ని రాఖీ సావంత్‌ ఖండించారు. ‘నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. నా భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు’ అంటూ ఆమె వరుస వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.