పెళ్లి చేసుకోను… లవ్ లో ఫెయిల్ అయ్యా

779
charmy failed in love

ఒక సమయంలో టాలీవుడ్‌ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగారు ఛార్మికౌర్. అయితే ఈ అందాల భామకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ తనలోని నటనా ప్రతిభను ఇంకా మెరుగుపర్చుకుంటుంది ఈ భామ. అయితే ఈ మధ్య సినిమాలు చేయడం బాగా తగ్గించిన చార్మీ దాని వెనక గల కారణాలు, అసలు ఇప్పటివరకు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయాలను చార్మీ ఈ విధంగా తెలిపారు. 

ఇప్పుడు నేను చేస్తున్న పని నాకెంతో నచ్చింది. అసలు నేనెందుకు ఈ పని చేస్తున్నానని ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకోలేదు. కేవలం సినిమాలే కాకుండా ఇతర విషయాలు చర్చించే అవకాశం వచ్చింది. కెమెరాను మిస్సవుతున్నాను అని అన్పించలేదు. మంచి స్క్రిప్ట్‌ దొరికితేనే సినిమా చేస్తాను. ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైంది. అతను మంచివాడే, నేనే చెడ్డదాన్ని. త్వరగా పెళ్లి చేసుకోమని అమ్మ ఒత్తిడి చేస్తుంది. అయితే పెళ్లిపై నాకు నమ్మకం లేదు. నా విషయంలో అది జరగని పని. అందుకే నా తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని అనుకుంటున్నానని చార్మీ తెలిపారు.