భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

611
caught-his-wife-red-handed-with-lover

మరొకరి భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్న వివాహిత(27) 8 ఏండ్ల క్రితం డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడి(30)ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా ఇంటిపక్కనే నివాసం ఉంటున్న భీమయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఈ విషయంపై భర్త పలుమార్లు నిలదీసినా పద్ధతి మార్చుకోలేదు. 

రెండురోజుల క్రితం డ్యూటీకి వెళ్లి రాత్రికి రానని భర్త చెప్పడంతో…. తన ప్రియుడు భీమయ్యను ఇంటికి పిలిపించుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్న భర్త గదిలోకి చూడగా ఇద్దరు కనిపించారు. ఈ విషయంపై స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో భీమయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.