సుకుమార్ కూతురి ఫంక్షన్… సెలెబ్రిటీల సందడి

352
Celebrities dazzle at Sukumar daughter’s function

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు స్టార్స్ పాల్గొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి విచ్చేశారు. మహేష్, నమ్రత సింపుల్ గా కన్పించారు.

నాగచైతన్య, సమంత కూడా ఈ వేడుకకు విచ్చేయగా… క్లీన్ షేవ్‌తో స్టైలిష్ లుక్‌లో నాగచైతన్య, మోడ్రన్ డ్రెస్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫంక్షన్‌కి వచ్చినట్టు సమాచారం.

సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ నిమిత్తం కేరళ బయల్దేరబోతోంది సుకుమార్ అండ్ టీమ్.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘పుష్ప’ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు సుకుమార్. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందించే ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.