అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ వివాహం జూన్ 21న హైదరాబాద్‌లోని ఐటిసి కోహినూర్ హోటల్లో నిరాడంబంరంగా జరిగిన సంగతి తెలిసిందే. నీలు షా అనే యోగా ట్రైనర్‌ని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ వివాహనికి కొద్ది మంది మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. అయితే తాజాగా గ్రాండ్ రిసెప్షన్ వేడుకని అల్లు ఫ్యామిలీ నిర్వహించగా ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, బన్నీ, శిరీష్, వరుణ్ తేజ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాబీ రిసెప్షన్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాబీ శ్రీమతి నీలు షా ది ముంబై కాగా, ఆమె హైదరాబాద్‌లో సెటిలైంది. పుణేలోని సింబయాసిస్ నుండి ఎంబీఏ పూర్తి చేసిన నీలు ..తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. వీరి ఇద్దరిది ప్రేమ వివాహం అని అంటున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రితమే పెళ్లి కాగా పలు కారణాల వలన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారట. వారికి ఓ కుమార్తె కూడా ఉన్నారు. బాబీ త్వరలో నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నట్టు ఇటీవల పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.