బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2019

475
BSF tradesman

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ట్రేడ్స్‌‌మెన్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. పదోతరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే సంబంధిత ట్రేడ్‌లో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులు నింపి సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి. ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో ఉద్యోగ ప్రకటన వెలువడిన నాటినుంచి 30 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. దూరప్రాంతాలవారు 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.




 

12 ట్రేడ్‌లలో 1,763 కానిస్టేబుల్ పోస్టులు వున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది.
పదోతరగతి, ఐటీఐ విద్యార్థులకు ఇది సువర్ణావకాశం

కానిస్టేబుల్ పోస్టులు (ట్రేడ్స్‌మెన్): 1763 పోస్టులు

ట్రేడ్‌ల వారీగా పోస్టుల వివరాలు..

కానిస్టేబుల్ ట్రేడ్           ఖాళీల సంఖ్య
కాబ్లర్                             32
టైలర్                            36
కార్పెంటర్                      13
కుక్                              561
డబ్ల్యూ/ సీ                      320
డబ్ల్యూ/ ఎం                    253
బార్బర్                         146
స్వీపర్                          389
వెయిటర్                       09
పెయింటర్                    01
డ్రాట్స్‌మ్యాన్                  01
టైలర్ (మహిళలు)           02
మొత్తం ఖాళీలు            1,763

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్‌తోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ నుంచి రెండేళ్ల డిప్లొమా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.



వయసు: 01.08.2018 నాటికి 18 – 23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత బీఎస్‌ఎఫ్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

పేస్కేలు: రూ.21,700 – రూ.69,100. వీటితోపాటు ఇతర భత్యాలు కూడా వుంటాయి.

చివరితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో ఉద్యోగ ప్రకటన వెలువడిన నాటినుంచి 30 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. దూరప్రాంతాలవారు 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 5 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్: www.bsf.nic.in