ప్రేమ దేశం ఈ సినిమా అప్పట్లో యువత నీ ఎంతల ఆకట్టుకుంది అంటే ప్రేమ స్నేహం అనే బంధానికి కొత్త నిర్వచనాన్ని తెలిపింది… అప్పటి నుంచి అబ్బాస్ అంటే ఒక క్రేజ్, హెయిర్ స్టైల్ నుంచి, డ్రెస్సింగ్ దాకా ఒక సెపరేట్ ట్రెండ్ అప్పుడు.. అమ్మాయిలకు హాట్ ఫెవరెట్ హీరో. బాయ్ ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పుకునేంత క్రేజ్. అతనే అబ్బాస్.
కెరీర్లో సూపర్ హిట్ సినిమాలున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో చాలా మంచి సినిమాలు చేశాడు. కానీ ఏమైందో గానీ ఉన్నపళంగా సినిమాలను వదిలేశాడు ఇండస్ట్రీ కి దూరం అయ్యడు.
అబ్బాస్ వెండితెర మీద కనబడి చాలా రోజులే అయింది. ‘ప్రేమదేశం’ సినిమాతో 1996లో ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు చేసి బాగా పాపులర్ అయ్యాడు.
ఒక టైం లో ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోయాడు ఈ లవర్ బాయ్. రజినీకాంత్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించి తన సత్తా చాటాడు.
కానీ కొన్నేళ్ల తరవాత తన సినిమాలే కాదు చేస్తున్న పాత్రలు కూడ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వరుసగా ఫెయిల్ అవ్వడం అనేది, కొన్నేళ్లు సాగింది. కొన్నిసార్లు బలవంతం మీద, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేయవలసి వచ్చింది. దీంతో విసుగెత్తి పోయి డైలమా లో పడిన అబ్బాస్ సినిమాలనే వదిలేశాడట.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమే గురించి మాట్లాడిన ఆయన చాలా బోర్ కొట్టేసి నటనకు స్వస్తి చెప్పానని, పాత్రలో, నటనలో మనసు పెట్టలేనప్పుడు నటనకు న్యాయం చేయలేనని అనిపించి సినిమాల్లో నటించడం మానేశాను అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు రీఎంట్రీ మీద కూడ ఆయనకు అంతగా ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు అనీ తెలుస్తుంది.